Wednesday, April 30, 2025

రైతు ఖాతాల్లో త్వరలో భరోసా నిధులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సాగయ్యే ప్రతి
పంటకు కనీస మద్దతు
ధర షుగర్ ఫ్యాక్టరీలను
పునరుద్ధ్దరిస్తాం వడగండ్లు,
భారీ వర్షాలతో పంట
నష్టపోయిన రైతులకు
త్వరలో పరిహారం
రైతు మహోత్సవ సభలో
మంత్రి తుమ్మల హామీ
శ్రీరాంసాగర్,
నిజాంసాగర్ పూడిక
తీయించి ఆయకట్టుకు
నీరిస్తాం : మంత్రి ఉత్తమ్

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో : ఇంతవరకు రైతుల ఖాతాల్లో పడని ‘భరో సా’ నిధులు త్వరలో జమ చేస్తామని వ్యవ సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానం లో రైతు మహోత్సవాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తో కలిసి ఆయన సో మవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..తెలంగాణకు పసుపు పారాణి వంటిది నిజామాబాద్ అ ని అభివర్ణించారు. పసుపు పంటకు మద్దతు ధర లభిస్తేనే
ఆ రైతు తలెత్తుకొని ఉం డగలడని అభిప్రాయపడ్డారు. రైతు సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలం గాణకు మించిన రాష్ట్రం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రాబోయే రోజుల్లో జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తామని ప్ర కటించారు. తెలంగాణలో సాగయ్యే ప్రతి పంటకు కనీస మద్దతు ధర అమలు చేస్తామని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తామని తెలిపారు. పసుపు బోర్డులో రైతులకు ఉపయుక్తంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ఆర్థికపరంగా ప్రభుత్వానికి కష్టాలున్నా రూ.33 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో డ్రిప్ వ్యవసాయం చేసే రైతులందరికీ ప్రాధాన్యత ఇచ్చి అందజేస్తామని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలకు సహాయం చేయాలని ఆడిగామని, అందుకు సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. వడగండ్ల వానలు, తదితర కారణాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా సాగు చేస్తూ రైతు మహోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. యేటా పంటలను తక్కువ ధరకు కొని అమ్ముతూ నష్టపోతున్న రైతులు పండించే జొన్న, మక్క తదితర ఏ పంటనైనా కొంటామని తెలిపారు. ఆయిల్ పాం పంట వేస్తే ప్రభుత్వ సహకారం ఉంటుందని, 24 గంటల్లో ఆ పంటను కొని ఒక్క రోజులోనే డబ్బులు రైతుల ఖాతాల్లో వేయిస్తామని స్పష్టం చేశారు. ఆదాయం ఉన్న పంటలను పండించాలని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌సి, బోనస్ బకాయిలను రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో వేస్తామని అన్నారు.

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గన్నీ బ్యాగుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లా కలెక్టర్లను కోరారు. రైతుల్లో చైతన్యం అవగాహన పెంచేందుకే రైతు మహోత్సవం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులకు గత ప్రభుత్వం రూ.1.81 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదని, కానీ తాము ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని అన్నారు. నెలాఖరులోపు టెండర్లు పిలిచి శ్రీరాంసాగర్, నిజాంసాగర్ పూడిక తీయించి ఆయకట్టుకు నీరందిస్తామని అన్నారు. గుత్ప ఎత్తిపోతలను మరింత విస్తరించడానికి అవసరమైన నిధులిచ్చి సకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. సన్నరకం బియ్యం రేషన్ షాప్‌ల ద్వారా ఎక్కడా లేని విధంగా రూ.3 కోట్ల పది లక్షల మందికి ఇస్తున్నామని తెలిపారు. గత బిఆర్‌ఎస్ లక్ష కోట్లతో మొదలు పెట్టిన కాళేశ్వరం నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో రైతులు పంటలు పండించారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత రైతులదని అన్నారు. రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించి రైతులతో మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News