యుద్ధం తీవ్రతరమైతే పాకిస్థాన్ పతనం ఖాయం
నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: భారత్ —పాకిస్థాన్ ల మధ్య యుద్ద వాతావరణంలో తన అవసరమని భావిస్తే యుద్దంలో పాల్గొనడానికి తాను సిద్దంగా ఉన్నానని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. భారత వైమానిక దళంలోని పనిచేసిన తాను మిగ్ 23 వంటి యుద్ద విమానాలు నడిపిన ఫైటర్ పైలెట్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా పలు అంశాలనుల ఆయన మీడియాతో పంచుకున్నారు. తాను 16 ఏండ్లకే డిఫెన్స్ లోకి వెళ్లానని, 1982లో మిగ్ 21 ఫైటర్ ఫైటెట్ గా పని చేశానని, ఆ తర్వాత మిగ్ 23 అత్యాధునిక ప్లైట్ కు పని చేశానని తెలిపారు.
శబ్ద వేగానికి 2.5 రేట్లు ఎక్కువ వేగంతో మిగ్ 23 ప్లయింగ్ అవుతుందన్నారు. తాను రక్షణరంగంలో ఉన్నప్పుడు ఉత్తర్ లే, శ్రీనగర్, అమృత్ సర్ లో పని చేశానని, చాలా చిన్న వయస్సులో 20 ఏళ్లకే ఫైటర్ పైలెట్ గా పని చేశానని వెల్లడించారు. ఆక్రమిత కాశ్మీర్‌ను ఇండియా ఆధీనంలోకి వస్తేనే సమస్యకు శాశ్వుత పరిష్కారమని ఆయన చెప్పారు. యుద్దం కొనసాగితే పాకిస్తాన్ పతనం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేయడం సరైన చర్యగా అభివర్ణించారు. గత ఏప్రిల్ 22న పాకిస్తాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గమని, మతం పేరు అడిగి మరీ చంపడం దారుణమన్నారు. పాకిస్తాన్ నిర్వాకానికి బుద్ది చెప్పడం సరైన చర్యగా తెలిపారు.ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు, కామికసేన్ డ్రోన్ లు పని చేశాయని తెలిపారు. కాశ్మీర్ విషయంలో ఒక చర్య జరిగితే తప్ప రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు.
Uttamkumar Ind Pak war
Uttamkumar Ind Pak war