Friday, May 2, 2025

మేక తెచ్చిన తంటా…. మర్మాంగాన్ని కొరికిన పక్కింటి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

లక్నో: మేక ఇంటి ఆవరణంలోకి వస్తుందని పక్కింటి వ్యక్తి గొడవపడడంతో దాని యజమాని మర్మాంగాన్ని అతడు కొరికిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజహన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 31 ఏళ్ల వ్యక్తికి మేకలు ఉన్నాయి. పక్కింట్లో గంగారామ్ సింగ్(28) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గంగారామ్ ఇంటి ఆవరణంలోకి మేక రావడంతో దాని యజమానితో గొడవకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మేక, యజమానిని నెట్టేశాడు. అప్పుడే యజమాని మీద పడి మర్మాంగాన్ని గంగారామ్ కొరికడంతో అతడు అపస్మాకర స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. రోజా పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగారామ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. బాధితుడు మర్మాంగం వద్ద చిన్న పాటి గాట్లు పడ్డాయని, సాధారణ జీవితం గడపవచ్చని వైద్యులు పేర్కొన్నారు. మర్మాంగాల వద్ద లోపల రక్తనాళాలు దెబ్బతినలేదని వైద్యులు పేర్కొన్నారు.

Also Read: ‘విద్వేష విష పాఠ’శాలలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News