- Advertisement -
రామ్‌చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ (peddi) చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏ.ఆర్.రెహమాన్ మాత్రమే తన సినిమాకు న్యాయం చేస్తాడని భావించి దర్శకుడు బుచ్చిబాబు ఏరికోరి మరీ తీసుకొచ్చాడు. ఇప్పటికే మంచి ట్యూన్స్ కూడా రెహమాన్ అందించినట్లు బుచ్చి బాబు తెలియజేశాడు. అయితే ఈ సినిమాలో ఓ మాంచి మాస్ ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అది శ్రీకాకుళం యాసలో జానపదాన్ని పోలి ఉంటుందని తెలిసింది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ స్టోరీ (Backdrop Story) కావడంతో? ఇలాంటి పాటతో అలరించబోతున్నారు. రెహమాన్ తనదైన స్టైల్‌లో ఈ పాటను అందిస్తున్నాడట. ఈ పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయం.
- Advertisement -