Thursday, May 15, 2025

ఆసక్తికరంగా ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్‌..

- Advertisement -
- Advertisement -

థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అశ్విన్‌ బాబు మరోసారి అలాంటి క్రేజీ ప్రాజెక్టుతోనే రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్‌‘. అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో టి.గణపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్‌, అయేషాఖాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకు మామిడాల ఎం ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘ధర్మం దారితప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడు గౌతమ్‌’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News