Tuesday, August 12, 2025

క్రీడా మైదానాలతో మారనున్న ఆత్మకూర్ రూపురేఖలు: మంత్రి వాకిటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /ఆత్మకూర్: ఆత్మకూర్ మున్సిపాల్టీలలో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలకు రాష్ట్ర స్పోర్ట్ అథారిటి చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి స్థల పరిశీలన చేశారు. ఆత్మకూర్ మున్సిపాల్టీ పరిదిలో జాతర మైదానం పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక మినీ స్టేడియం, అదేవిధంగా జాతర మైదానంలో నడక వ్యాయామ దారులకు సౌకర్యాలు అధునీకరించడంతో పాటు పక్కనే ఒక ఇండోర్ స్టేడియం కొరకు ప్రణాళికలు సిద్దం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ క్రీడా మైదానాలకు దాదాపు 5 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ తీసుకొని 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అదేవిదంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు సైతం స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఆత్మకూర్‌లో నిర్మించనున్న క్రీడా మైదానాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసి స్పోర్ట్ అథారిటికి సమర్పిస్తే నెలరోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కొన్ని హంగులతో క్రీడా మైదానాలు పూర్తి అయితే ఆత్మకూర్, అమరచింత మున్సిపాల్టీల రూపు రేఖలు మారిపోయాయని తెలియజేశారు. అనంతరం ఆగస్టు 25న హైదరాబాద్ ఎల్.బి. స్టేడియం టెన్నిస్ క్యాంప్లెక్స్ లో నిర్వహించనున్న సూపర్ స్పెషాలిటి హెల్త్ క్యాంప్ పోస్టరును మంత్రి, స్పోర్ట్ అథారిటి చైర్మన్ శివసేన రెడ్డి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News