బిసి కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ సోమవారం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్, రామారావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ డాక్టర్ వకుళాభరణం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు సార్లు బిసి కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బిసి సభ్యునిగా, అనంతరం బిసి కమిషన్ చైర్మన్‌గా సేవలందించారని చెప్పారు. వకుళాభరణం మాట్లాడుతూ బిసిలకు నిజమైన న్యాయం బిజెపితోనే సాధ్యమని అన్నారు. బిసి రిజర్వేష్నలలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కుట్రను బిజెపి ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు. బిజెపిలో చేరడం వల్ల ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. బిసిల వాటాను కాపాడుకోవడం, కులగణన ఆధారంగా రిజర్వేషన్ల పెంపు అవసరమని డాక్టర్ వకుళాభరణం అన్నారు.
బిజెపిలోకి వకుళాభరణం కృష్ణమోహన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -