- Advertisement -
దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు చాలా వరకూ ప్రయాణ సమయం తగ్గుతోంది. ఎంతో సౌకర్యవంతంగా ఈ రైలులో చాలామంది ప్రయాణిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ మరో మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. అయితే వందేభారత్ రైళ్ల కారణంగా దేశం ఏకతాటిపైకి వచ్చిందని జి20లో భారత తరఫున షెర్ఫాగ ఉన్న అమితాబ్ కాంత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ట్రాక్‌తో దేశాన్ని కలుపుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా ఓ ఫోటోని షేర్ చేశారు. అందులో వందేభారత్ రూట్స్ ఉన్నాయి. వాటిని చూస్తే.. అచ్చం భారత మ్యాప్‌ల కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
- Advertisement -