Monday, July 7, 2025

‘వందేభారత్’కు త్రుటిలో తప్పిన పెను ముప్పు

- Advertisement -
- Advertisement -

తాళ్లపూసపల్లి సమీపంలో ఎద్దును ఢీకొన్న రైలు
మన తెలంగాణ/కేసముద్రం: విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెను ముప్పు తప్పింది. ఆదివారం తాళ్లపూసపల్లి, కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య 428/11 కిలోమీటరు వద్ద రంగాపురం గేటు సమీపంలో అప్‌లైన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వెళుతుండగా అకస్మాత్తుగా ఎద్దు పట్టాపైకి వచ్చింది. రైలు స్పీడ్‌గా మహబూబ్‌నగర్ జిల్లావస్తుండడంతో ఎద్దును ఒక్కసారిగా ఢీకొనడంతో ఇంజన్ ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్నది. దీనితో కొన్ని నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ఎద్దును రైలు బలంగా ఢీకొనడంతో ముందు క్యాటిల్‌గార్డ్ పూర్తిగా ధ్వంసమై ట్రాక్ పక్కన పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News