Tuesday, June 3, 2025

వార ఫలాలు (01-06-2025 నుండి 07-06-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటిస్తారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకున్న వాక్చాతుర్యంతో అందరిని మెప్పించ గలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. .

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఒక మంచి సంస్థలో మీకు ఉద్యోగం లభిస్తుంది. భూసంబంధిత  వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వైద్య వృద్ధిలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి లాభాలు బాగున్నాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత నిరాశ కలిగిస్తుంది.

ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆహార నియమాలు తప్పక పాటించాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎప్పటినుండో అమ్ముడుపోకుండా పెండింగ్లో ఉన్నటువంటి స్థలం ఈ వారం అమ్ముడు పోతుంది.  ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి, నర దిష్టి తొలగిపోతుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు గ్రే.

మిథునం:  మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం వల్ల మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో వ్యాపార పరంగా భాగస్వామ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు కొంత నిరాశకు గురవుతారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గురు గ్రహ అనుగ్రహం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, రుద్ర పాశుపత హోమాన్ని చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

సహోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. వివాహది శుభకార్యాలు ముడి పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు, కలిసి వచ్చే రంగు ఎల్లో.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీరు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.

విలువైన అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడులు ఎక్కువగా పెడతారు. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండండి. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కి ఫాస్ట్ ఫుడ్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చిన్నపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు బ్లూ.

 

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యక్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఫ్లాట్ గాని ప్లాటు గాని కొనుగోలు చేస్తారు. మీరు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి ఆ పనిలో విజయం సాధిస్తారు. ధనం విషయంలో మధ్యవర్తిగా ఉండడం కలిసి రాదు. కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చాలావరకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాలే కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొంతవరకు బాగుంటుందని చెప్పవచ్చు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం ఘనంగా చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. ఏదైనా పని ప్రారంభించే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతనే ముందుకు వెళతారు.

సంతానం యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. మీకు కలిసి వచ్చినదనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత మానసికంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. నీకు కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. దైవానుగ్రహం వల్ల మీరు కోరిన కోరికలు అన్నీ ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు కలుగుతాయి. కళా రంగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పరమైన వ్యవహారాలలో ఆలోచనల పరంగా స్థిరత్వం ఉండదు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. అవార్డు రివార్డులు లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన స్కీములు రెన్యువల్సు, లీజులు లాభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గడిచిన మూడు, నాలుగు వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మనం చేసే పనులకు మనమే బాధ్యులమని భావిస్తారు. వివాహ సంబంధం కుదిరిన తర్వాత వివాహ పొంతనలు చూసుకుని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రీన్. .అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన చేయించండి.

తుల:  తులా రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీకు వచ్చిన అవకాశాలను సక్రమంగా వినియోగించుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల వలన మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి రావు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది.

నిధానంగా అభివృద్ధిలోకి వస్తారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు, వైద్య వృత్తిలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు. జీవితంలో ఏది జరిగినా మనమంచికే అని ముందుకు వెళతారు. మీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా ఉంటాయి. మీరు చేసే పనిలో మీ ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటారు. ట్రావెల్స్ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో  ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. శుక్ర గ్రహ స్తోత్రాన్ని చదివి శుక్రుడికి జపాలు చేసి దానాలు ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన. అమ్మవారిని కుబేర కుంకుమతో పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు ఎరుపు.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఋణాలు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనపడడానికి ఎక్కువగా ఖర్చు పెడతారు. లోన్లకి, క్రెడిట్ కార్డులకి ఎంత దూరంగా ఉంటే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వారాంతంలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులు చక్కగా రాణించగలుగుతారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు గ్రీన్.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో విఘ్నాలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా కూడా నష్టాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాన్ని కొనసాగించండి నూతన వ్యాపారాలని ప్రారంభించడానికి కాలం అనుకూలంగా లేదు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు.

ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం దక్కడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. పాత ఋణాలు తీర్చి వేస్తారు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచే వారు ఎక్కువగా ఉంటారు వారిపట్ల జాగ్రత్తగా ఉండండి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాబిస్తాయి. కళా రంగంలో ఉన్నవారికి అవార్డులు లభిస్తాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహనయోగం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.

మకరం:   మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భూ సంబంధిత వివాదాలు తీరుతాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోతాయి.

కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. బందు వర్గంలో మిత్ర వర్గంలో మీకు సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నష్టం వాటిల్లే పరిస్థితి గోచరిస్తుంది. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ విద్యకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి ఆదరణ లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.  మీకున్న తెలివితేటలతో అందర్నీ మెప్పించ గలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి.  సంతానం మీ మాట వినకపోవడం మీ మానసిక వేదనకు కారణం అవుతుంది. పర్సనల్ లోన్లకి దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని మొదలుపెట్టిన ముందుకు సాగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విహారయాత్రలు చేస్తారు. విదేశీయానం చేయగలుగుతారు. విదేశాలలో వ్యాపార విస్తరణ చేయడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. గైనిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. నూతన పెట్టుబడులు కలిసి రావు. స్టాక్ మార్కెట్ కి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

Guruvaram rasi phalalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News