- Advertisement -
మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ పెళ్లి వాహనం బోల్తా కొట్టడంతో ఓ మహిళ సహా నలుగురు మరణించగా, 13 మందికి గాయాలయ్యాయి. ఇండోర్ నుంచి సిరోంజ్‌కు పెళ్లివారిని తీసుకొస్తున్న జీప్ తెల్లవారు జామున 3.00 గంటలకు లటేరి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి విదిశ, లటేరిలలో ఉన్న ఆసుపత్రులలో చికిత్సనందిస్తున్నారు. కాగా చనిపోయిన నలుగురిని నారయణ్(20), గోకుల్(18), బసంతి బాయ్(32), హజారి(40) గా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -