- Advertisement -
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డిసిఎంను కారు ఢీకొనడంతో తండ్రి, కూతురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే కుమార్తె తేజశ్రీ మృతి చెందగా చికిత్స పొందుతూ తండ్రి చనిపోయాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తెలకపల్లి మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన వాసులుగా గుర్తించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు తొలగించారు.
- Advertisement -