- Advertisement -
వెల్లగూరు: జగిత్యాల జిల్లా వెల్గటూరులో పరువు హత్య జరిగింది. యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారు. రాజీ కుదుర్చుకోవాలని వెల్గటూర్ ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు నిరసన చేస్తే తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు బెదిరింపులకు దిగారు. హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మల్లేష్ అనే యువకుడు, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. యువతిని మర్చిపోవాలని పలుమార్లు మల్లేష్ ను ఆమె కుటుంబ సభ్యులు బెదిరించినట్టు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమ విషయంలోనే మల్లేష్ ను యువతి కుటుంబ సభ్యులు చంపి ఉంటారని గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -