Wednesday, August 20, 2025

టెక్నాలజీని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చామని అన్నారు. ఈ సందర్బంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వెలుగు కార్యక్రమం నడిచిందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 4 వ స్థానానికి వచ్చిందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 3వ స్థానానికి రానుందని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. ప్రతీ ఏడాది రైతులకు రూ. 20 వేలు చొప్పున పెట్టుబడి సహాయం చేస్తున్నామని, కుటుంబంలో ఎంత మందికి పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు.

ఆడబిడ్డలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ధరలు పెరిగాయని మళ్లీ కొందరు కట్టెల పొయ్యి వాడారని చెప్పారు. అందుకే మహిళ కోసం ఉచితంగా గ్యాస్ (Free gas woman) సిలిండర్లు అందిస్తున్నామని, టెక్నాలజీని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆనాడు విజన్ 2020 లో అన్నానని, తాను ఆ రోజు ఏం చెప్పానో ఇప్పుడు అది జరుగుతోందని అన్నారు. ఇప్పుడు విజన్ 2047 అంటున్నానని, 2047 పెద్ద దూరం లేదని, 22 ఏళ్లు మాత్రమే ఉందని తెలిపారు. ఒకప్పుడు తాను సెల్ ఫోన్ అంటే చాలా మంది ఎగతాళి చేశారని, ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News