Monday, July 7, 2025

చిరంజీవి సినిమాలో నటిస్తున్నాను.. కన్ఫామ్ చేసిన వెంకటేష్

- Advertisement -
- Advertisement -

సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మెగా 157’ (MEGA 157) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరు.. తన అసలు పేరైన శివ శంకర్ వరప్రసాద్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. అయితే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తను వెంకటేష్ కన్ఫామ్ చేశారు. అమెరికాలో జరుగుతున్న ‘నాట్స్ 2025’లో వెంకీ మామ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నానని చెప్పిన వెంకటేష్.. చిరంజీవి (MEGA 157) సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నానని వెల్లడించారు. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ఫన్నీగా, నవ్వులు పూయించేలా ఉంటుందని అన్నారు. అలాగే మీనాతో కలిసి దృశ్యం 3 సినిమా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది అనిల్ రావిపూడితో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ కొట్టామని.. మళ్లీ మేమిద్దరం కలిసి రాబోతున్నట్లు స్పష్టం చేశారు. తన స్నేహితుడితో కలిసి మరో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నానని, ఆయన తెలుగులో పెద్ద స్టార్ అని వెంకీ మామ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News