Monday, May 19, 2025

వెంకీ అట్లూరి-సూర్య మూవీ ప్రారంభం.. హీరోయిన్ ఎవరంటే?

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో జోరుమీదున్న టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తన కొత్త సినిమాను తమిళ స్టార్ హీరో సూర్యతో చేయబోతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ లతో సతమతమవుతున్న సూర్య తొలిసారి డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. సార్, లక్కీ భాస్కర్ హిట్స్ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఎర్పడ్డాయి.సోమవారం ఈ మూవీ పూజా కార్యక్రమాలను హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా ప్రేమలుతో క్రేజీ తెచ్చుకున్న మలయాళం బ్యూటీ మమితను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ అమ్మడి మూవీ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ సమర్ఫణలో రూపొందనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News