Saturday, July 12, 2025

‘కేడీ ది డెవిల్’ అందరికీ నచ్చుతుంది

- Advertisement -
- Advertisement -

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’.(Caddy the Devil) ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంజయ్ దత్ మాట్లాడుతూ “డైరెక్టర్ ప్రేమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రీష్మా చాలా చక్కగా నటించారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.

శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి” అని అన్నారు. ధృవ సర్జా మాట్లాడుతూ “సంజయ్ దత్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. రీష్మా మంచి నటి. మా మూవీ అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు. దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ “కాళిదాసు పాత్రను ధృవ అద్భుతంగా పోషించారు. తన పాత్రను ఒప్పుకున్న సంజూ బాబాకి థాంక్స్. (Thanks to Sanju Baba) చిత్రీకరణ సమయంలో శిల్పా శెట్టి ఎంతో సహకరించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా శెట్టి, రీష్మా నానయ్య, సుప్రిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News