- Advertisement -
ప్రముఖ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ మాజీచైర్మన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ మంగళవారం కన్ను మూశారు.ఆయన వయస్సు 95 ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.స్వదేశీ అణ్వాయుధ రూపకల్పనలో డాక్టర్ హోమీ భాభాతో కలిసి శ్రీనివాసన్ పని చేశారు. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషన్ పురస్కారంతో సత్కరించింది. శ్రీనివాసన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మృతిపట్ల తమిళనాడు ప్రభుత్వం సైతం సంతాపం తెలియజేసింది. ఉదగమండలం కలెక్టర్ లక్ష్మీ భవ్య తన్నీరు ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు.
- Advertisement -