Sunday, September 7, 2025

ఉప రాష్ట్రపతికి నో సాలరీ..!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ అధికారిక పీఠంగా ఉంది. అయితే ఈ గౌరవప్రదమైన హోదాలోని వారికి భత్యాలు తప్పితే జీతం ఉండదు. దేశంలో ఇతర పదవులతో పోలిస్తే నెలనెల జీతం దక్కని పదవి ఇదొక్కటే అయింది. ఈ నెల 9వ తేదీన దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగుతుంది. ఎన్‌డిఎ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ప్రతిపక్షాల అభ్యర్థిగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ దశలో ఈ పీఠంలోని వారు పొందే ఆర్థిక ప్రయోజనాల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఉప రాష్ట్రపతి పదవి హోదా ద్వారా జీతం అందకపోయినప్పటికీ ఈ స్థానంలో ఉండే వారు ఎగువ సభ రాజ్యసభ్య ఎక్స్ అఫియో ఛైర్మన్‌గా జీతం పొందుతారు. ఉప రాష్ట్రపతి రాజ్యసభ సారధ్య బాధ్యతలలో ఉంటూ ఎంత జీతం పొందాలి. ఎటువంటి అలవెన్స్‌లకు అర్హులు అనే విషయం ఖరారు అవుతుంది. 1953 ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ నిబంధనల పరిధిలో వీటిని ఖరారు చేస్తారని అధికారలు తెలిపారు. హోదా పరంగా ఉప రాష్ట్రపతి పదవి కీలకమే . అయితే ఈ స్థానం ద్వారా రెగ్యులర్ సాలరీ పొందేందుకు వీలుండదు.

రాజ్యసభ ఛైర్మన్ హోదాలో నెలకు రూ 4 లక్షల జీతం వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా ఆపద్ధర్మ ఉపరాష్ట్రపతి బాధ్యతల్లోకి వస్తే అటువంటి వారికి రాష్ట్రపతితో సమానంగా నెలవారిగా రూ 5లక్షల జీతం అందుతుంది. అయితే రాజ్యసభ ఛైర్మన్‌గా ఉండటానీకి వీల్లేదు. జీతం సంగతి పక్కన పెడితే ఉప రాష్ట్రపతికి ఉచిత బస, వైద్య చికిత్సల ఏర్పాట్లు, రైలు విమాన ప్రయాణాలు, ల్యాండ్‌లైన్, మొబైల్ కనెక్షన్లు పొందవచ్చు. వ్యక్తిగత సెక్యూరిటీ , సహాయక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మాజీ ఉప రాష్ట్రపతికి నెలకు రూ 4 లక్షల వరకూ .జీవితాంత పెన్షన్ , టైప్ 8 బంగళా, ఓ పిఎస్, అదనపు పిఎస్, సొం సహాయకుడు, ఓ వైద్యుడు, నర్సింగ్ అధికారి, నలుగురు వ్యక్తిగత సహాయకుల ఏర్పాటుకు వీలుంటుంది.

Also Read: భారత్‌లో అతిపెద్ద రైలు సొరంగం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News