Tuesday, July 15, 2025

విదర్భ రీజియన్‌లో వరదలు..8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఈనెల 8, 9 తేదీల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించి విదర్భ రీజియన్‌లో ఎనిమిది మంది మృతి చెందారు. తూర్పు ప్రాంతం నాగపూర్, అమరావతి డివిజన్లలో ఎడతెరిపి లేని వానలతో ఇళ్లు ఆస్తులు ధ్వంసమై పంటలు దెబ్బతిని అపారనష్టం సంభవించింది. నాగపూర్, వార్ధా, గోండియా, భాంద్రా, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. బాధితులకు తక్షణం సహాయం అందేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర వైపరీత్యాల నివారణ నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. మే 30 తీర్మానం ప్రకారం ఇళ్లు కూలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం అందించడమైందని, ఇంకా 2023 జులై 28 తీర్మానం ప్రకారం బాధితులైన షాపుల యజమానులకు, వ్యాపారులకు, వంటపాత్రలు,

దుస్తులు తదితర నిత్యావసరాలు అందించడానికి గడువు పొడిగించినట్టు చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా 20,854 హెక్టార్ల పంటభూములు దెబ్బతిన్నాయని, 29,920 మంది రైతులు బాధితులయ్యారని తెలిపారు. “ నాగపూర్ డివిజన్‌లో ఏడుగురు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. 1927 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 40 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.,209 పశువుల పాకలు దెబ్బతిన్నాయి. 715 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమైంది. ఈ నష్టాలపై అంచనా జరుగుతోంది. అమరావతి డివిజన్‌లో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడ్డారు. 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తొమ్మిది పూర్తిగా కూలిపోయాయి, 3411 హెక్టార్ల పంటభూములు దెబ్బతిన్నాయి.” అని మంత్రి వివరించారు. బాధితులందరికీ సత్వరం సహాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News