Thursday, August 14, 2025

వియత్నాంలో నేరం శిక్షల కొత్త చట్టం

- Advertisement -
- Advertisement -

వియత్నాంలో సరికొత్త నేరం శిక్ష చట్టం అమలులోకి వచ్చింది. చట్ట సంస్కరణలలో భాగంగా ఎవరైనా ఎనిమిది రకాల ననేరాలు చేసినా ఎటువంటి శిక్షలకు గురి కాకుండా ఉండొచ్చు. ఈ క్రమంలోనే దేశంలోని అత్యంత పేరు మోసిన రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజం, వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్ మరణశిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. వియత్నాంలో జరిగిన అతి భారీ ఆర్థిక మోసాల కేసు విచారణ తరువాతి మరణశిక్ష నుంచి ఆయన బయటపడ్డారు. దేశంలో తీసుకువచ్చిన చట్టపరమైన మార్పుల ప్రకారం

ఎనిమిది నేరాలు అంటే ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలు , ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, నకిలీ ఔషధాల తయారీ విక్రయాలు , యుద్ధాలు రెచ్చగొట్టడం , వేగుచర్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లంచాలు తీసుకోవడం, కల్లోల సృష్టి చర్యలకు దిగిన వారికి మరణశిక్ష ఉండదు.ఈ కీలక సంస్కరణల బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. అక్రమ ఆర్థిక లావాదేవీల కేసులో మరణశిక్ష పడ్డ తమ క్లయింట్ కూడా ఈ శిక్ష నుంచి మినహాయింపు పొందేందుకు వీలేర్పడిందని ఆమె తరఫు న్యాయవాది గురువారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News