Friday, May 30, 2025

ఆసక్తికరంగా విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

‘బిచ్చగాడు’ సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). సినిమా.. సినిమాకి ఆయన సబ్జెక్ట్ ఎంపికలో ఎంతో వైవిధ్యం చూపిస్తుంటారు. అందుకే ఆయన సినిమాలంటే ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతుంటారు. విజయ్ ఆంటోని తాజాగా నటిస్తున్న చిత్రం ‘మార్గన్’ (Maargan). మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. విజయ్ ఆంటోనీ (Vijay Antony) అల్లుడు అజయ్ ధీషన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మార్గన్ (Maargan) సినిమా తెలుగు ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో పాత్రకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌లోని అన్ని షాట్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పలు తమిళ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన లియో జాన్ పాల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News