Tuesday, September 16, 2025

’భద్రకాళి’ మంచి పొలిటికల్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్‌ఫుల్ ప్రా జెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వం త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్… రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “భద్రకాళి సినిమాకు అరుణ్ ప్రభు లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కచ్చితంగా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది” అని అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ భద్రకాళి సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ.. “ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. ఇది ఏ రాష్ట్రానికో దేశానికి సంబంధించిన పాలిటిక్స్ కాదు. ఇది పీపుల్ పాలిటిక్స్. అందరికీ సినిమా నచ్చుతుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామాంజనేయులు, హీరోయిన్లు తృప్తి రవీంద్ర, రియా, రచయిత భాష శ్రీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News