- Advertisement -
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కింగ్డమ్. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం తిరుపతిలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ, విజయ్, భాగ్యశ్రీ బోర్సేలు ఆదివారం తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన వీరికి టిటిడి అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, ఈ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో నెట్టింట ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
- Advertisement -