- Advertisement -
సినీ నటుడు విజయ్ దేవరకొండకు ఇడి మరోసారి నోటీసులు జారీ చేసింది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స్‌ర్ల బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి మనీలాండరింగ్ పై ఇడి దృష్టి సారించింది. ఈ క్రమంలో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స్‌ర్లు విచారణకు హాజరు కావాలంటూ ఇడి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సినీ నటుడు విజయ్ దేవరకొండకు మెదటగా ఆగస్ట్ 6వ తేదీన విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే తాజాగా మరోసారి జారీ చేసిన నోటీసుల్లో ఆగస్ట్ 11వ తేదీన హాజరు కావాలని సూచించింది. కాగా, విజయ్ దేవరకొండ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని మార్చినట్లు సమాచారం. ఇదే కేసులో జులై 30వ తేదీన ప్రకాశ్ రాజ్, ఆగస్ట్ 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఇడి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -