Saturday, August 2, 2025

విజయ్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్

- Advertisement -
- Advertisement -

కథ: 1991 ప్రాంతంలో సూరి (విజయ్ దేవరకొండ) (Vijay Deverakonda) హైదరాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తుంటాడు. చిన్నతనంలోనే తండ్రిని చంపి పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) కోసం అతను ఎదురు చూస్తుంటాడు. అలాంటి సమయంలో శివ శ్రీలంకలోని జాఫ్నాలో ఒక స్మగ్లింగ్ గ్యాంగ్ కి లీడర్ గా ఉన్నట్లు సూరికి తెలుస్తుంది. ఒక పోలీస్ అధికారి శివ గురించి ఈ విషయం చెప్పి అతడిని తిరిగి తీసుకురావడం కోసం జాఫ్నాకు సూరిని గూఢచారిగా పంపిస్తాడు. మరి జాఫ్నాకు వెళ్లిన సూరి.. శివను కనుక్కున్నాడా? తన అన్నను తిరిగి తెచ్చుకున్నాడా? అక్కడ అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అతనెలా ఛేదించాడు? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం, విశ్లేషణ: ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉంది. తన నుంచి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ లభిస్తుంది. తన పాత్ర కోసం విజయ్ తనని తాను ఆవిష్కరించుకున్న విధానం బాగుంది. తన లుక్స్ పరంగా కానీ బాడీ లాంగ్వేజ్ పరంగా గాని విజయ్ కొత్తగా కనిపిస్తాడు.(Vijay looks new) సత్యదేవ్ తో కొన్ని సీన్స్‌లో తన భావోద్వేగంతో కూడిన నటనతో విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్, కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ షేడ్ లో విజయ్ అదిరిపోయాడు. ఇక మరో నటుడు సత్యదేవ్ కి కూడా మంచి రోల్ సినిమాలో దక్కింది.తన పాత్రలో సత్యదేవ్ చక్కగా నటించాడు. అలాగే విలన్ రోల్‌లో వెంకటేష్ మంచి విలనిజాన్ని ప్రదర్శించాడు. అన్న కోసం తపించే తమ్ముడి పాత్రలో విజయ్ దేవరకొండ భావోద్వేగాలను చక్కగా పలికించాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్ర పరిధి మరీ తగ్గించేశారు.

కనిపించిన తక్కువ సన్నివేశాల్లో భాగ్యశ్రీ బాగానే అనిపించినా.. తనకి ఈ కథలో పెద్దగా ప్రాధాన్యం కనిపించదు. ఇక సినిమా ప్రథమార్ధం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. శ్రీకాకుళంలోని ఓ చిన్న గూడెం వాసులు బ్రిటీషర్స్ నుండి తప్పించుకోవడం, తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం అక్కడ స్మగ్లర్లుగా మారడం, వారిని అడ్డం పెట్టుకుని అండర్ వరల్డ్ గ్యాంగ్ అక్రమ ఆయుధాలను సరఫరా చేయడం… ఇవన్నీ ఆసక్తిని కలిగిస్తాయి. ఇక ఇల్లు వదిలిపారిపోయిన అన్నను సూరి కలవడం కోసం చేసే ప్రయత్నం, అందులో ఎదురైన సమస్యలను ఎదుర్కొన్న తీరు చూస్తే సినిమా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళి కూర్చోపెట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి… ఇంటర్వెల్ తర్వాత సీన్ సీన్‌కూ

మూవీ గ్రాఫ్‌ను కిందకు దించేశాడు. మళ్ళీ రావా.. జెర్సీ చిత్రాలతో తన స్థాయి వేరని చాటుకున్న ఈ యువ దర్శకుడు ‘కింగ్‌డమ్’ ప్రోమోలతో ప్రేక్షకులను ఆశల పల్లకిలో ఊరేగించాడు. గౌతమ్ అంటే భిన్నంగా ఏదో చేస్తాడని.. కొత్త అనుభూతి పంచుతాడనే భరోసాతో థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులను ఊరించి ఊరించి సెకండాఫ్‌లో ఒకింత నిరాశకే గురి చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగున్నా.. అది అనేక ప్రశ్నలను రేకెత్తిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం సెకండ్ పార్టులో చూసుకోమన్నట్లుగా లీడ్ ఇచ్చి సినిమాను ముగించారు. ఇక మేకింగ్ పరంగా సినిమా బాగుంది. అలానే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News