మనతెలంగాణ/మెదక్ ప్రతినిధిః విజయ డైరీ మెదక్ నుంచి సంగారెడ్డికి తరలిపోయిందని నిన్న బీఆర్‌ఎస్ నాయకులు చేసినటువంటి మాటలను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అద్యక్షులు హాఫీజ్ మోల్సాబ్ తప్పుపట్టారు. విజయ డైరీ డైరెక్టర్ డీడీ రమేష్‌తో మాట్లాడి వివరణ కోరగా స్టాప్ తక్కువగా ఉన్న కారణంగా ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించాల్సి వస్తుందని అంతే తప్ప అని విజయ డైరీ ఎక్కడికి తరలిపోదని ఆయన సమాధానం ఇచ్చారు. గత 45 సంవత్సరాలుగా మెదక్ విజయ డైరీ తన సేవలు అందిస్తుందని హాఫీజ్ మోల్సబ్ అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు అభివృద్దిని చూసి ఓర్వలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో దీన్ని అభివృద్ది పథకంలో నడిపిస్తామని ఇంకా పాల ఉత్పత్తి కేంద్రాలను పెంచి పాల కేంద్రాల కేఫుల్ పెడతామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ మోల్సాబ్ అద్యక్షులు బ్లాక్ మెదక్, మ్యాకల రవి, మాజీ కౌన్సిలర్, మహేందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అశోక్‌రెడ్డి, ముజీబ్, దేవులా, గాడి రమేష్ పాల్గొన్నారు.
విజయడైరీ మెదక్ నుంచి తరలిపోలేదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -