Tuesday, September 16, 2025

పురందేశ్వరీ… బిజెపిని ముంచు… టిడిపిని బతికించు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపికి వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి చురకలంటించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్యం, బెయిల్ షరుతులు సరే కానీ పార్టీలో లోకేష్, భువనేశ్వరి ఏమయ్యారని?, టిడిపి పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా? అని ఎద్దేవా చేశారు. తెలంగాణ తరహాలోనే టిడిపి జెండా ఆంధ్రాలో కూడా పీకేశారా? లేక టిడిపి భారమంతా పురంధేశ్వరిపైనే పెట్టారా? అని ప్రశ్నించారు. సొంత పార్టీ బిజెపిని ముంచడంలో పురందేశ్వరి దిట్ట కావచ్చేమో కానీ బావ పార్టీ టిడిపిని బతికించడంలో కాదు సుమా? అని విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News