Sunday, June 8, 2025

విజయశాంతికి మంత్రి పదవి..?

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి పదవి ఖాయం అనేది సర్వత్రా చర్చ మొదలైంది. గతంలో గ్రేటర్ నుంచి రాష్ట్రమంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఉండేది. ప్రస్తుతం లేదు. అయితే, ఎన్నికల్లో గ్రేటర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులెవరూ విజయం చేజిక్కించుకోలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి రాష్ట్ర క్యాబినేట్ దక్కలేదు. నామినేటెడ్ కేటగిరిలోనూ పలువురు ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. అందులో విజయశాంతి ఒకరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక.. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ప్రస్తుతం గ్రేటర్‌కు మంత్రి పదవి రావడం ఖాయమనేది, అందులో విజయశాంతి పేరు అధికంగా వినిపిస్తున్నది. ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేశారు. అధికారం వచ్చాక ఏమీ అడగలేదనీ, ఎమ్మెల్సీ పదవిని పిలిచి ఇచ్చారనేది టాక్ ఉన్నది.

మహిళకు అవకాశం..
ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గం 11 మందితో ఉండగా అందులో ఇద్దరు మహిళల( కొండా సురేఖ, సీతక్కలు)కు మాత్రమే మంత్రి పదవి లభించింది. ఉన్న వారిలోనూ 1:3 గా చూసినా మరో మహిళకు మంత్రివర్గంలో చోటుకల్పించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ విజయశాంతికి మంత్రి పదవి లభించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు సినీరంగానికి చెందిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల చలనచిత్ర పరిశ్రమ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారే దిశగా ప్రయత్నం చేసినట్టుగా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లోని అభిప్రాయం. అయితే, గ్రేటర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన చిరంజీవికి గతంలో కేంద్ర మంత్రి పదవి లభించింది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన సినీరంగానికి చెందిన జయసుధకు మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు సినీరంగానాకే చెందిన విజయశాంతికి మంత్రి పదవి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఎప్పుడు ప్రకటిస్తారో లేదో.. వేచి చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News