న్యూఢిల్లీ : భారత్ పాక్ మధ్య ఇటీవలి కాల్పుల విరమణ, సైనిక చర్యల నిలిపివేత వెనుక అమెరి కా ప్రమేయం లేదా ట్రంప్ చొరవ ఏదీ లేదని భా రత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు కాల్పుల విరమణ అనేది కేవలం ఉభయ పక్షాలు అంటే భారత్ పాక్‌ల ద్వైపాక్షిక విషయం. అం తకు మించి ఏమీ లేదని ఆయన సంబంధిత విదేశాంగ శాఖ పార్లమెంటరీ ప్యానల్‌కు వివరించారు. కాల్పుల విరమణ కేవలం ద్వైపాక్షిక విష యం. ఇందులో మూడో పక్షం అంటే అమెరికా పాత్ర ఉందనే వార్తలు సరికావని తెలిపారు. తన పా త్ర గురిచి చెప్పుకోవడానికి ఆయన భారత్ అనుమతి ఏదీ తీసుకోలేదని కూడా చెప్పారు. దీనికి మిస్రి సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ఏ దశలో అణ్వాయుధ దాడికి దిగుతానని బెదింరించిందనే వార్తలను కూడా ఆయన తోసిపుచ్చారు. సాధారణ, త్రివిధ బలగాల స్థాయి సంప్రదాయక యుద్ధ రీతిలోనే కాల్పులు ,
వైమానిక దాడులు సాగాయని వివరించారు. అంతకు మించి తీవ్ర విషయం ఏదీ చోటుచేసుకోలేదని ఆయన తెలిపారు. అయితే భారత వాయుదళం పాకిస్థాన్‌లోని కొన్ని నిర్థిష్ట వైమానిక స్థావరాలను అనివార్యంగానే, వ్యూహాత్మక రీతిలో ఎంచుకుని ధ్వంసం చేశాయని ఆయన అంగీకరించారు. కాల్పుల విరమణ తన జోక్యం వల్లనే జరిగిందని ట్రంప్ ఇప్పటికే ఏడుసార్లు చెప్పారు. దీనిపై ఇండియా ఎందుకు మౌనంగా ఉందని ప్యానెల్‌లోని ప్రతిపక్ష ఎంపిలు ప్రశ్నించారు. అంతా తానే తనవల్లనే శాంతి కుదిరిందని ట్రంప్ నాటకీయంగా చెపుతూ పోతే భారత ప్రభుత్వ మౌనం అంగీకారం కిందికి రాదా? అని ఎంపిలు నిలదీశారు. పైగా ట్రంప్ తరచూ కశ్మీర్ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కశ్మీర్‌పై ట్రంప్ మాటలతో మోడీ ప్రభుత్వం ఏకీభవిస్తుందా? అని ఎంపిలు ప్రశ్నించారు. కశ్మీర్ ప్రస్తావన అధికారం ఏ ఇతర దేశానికి లేదని విదేశాంగ కార్యదర్శి తెలిపారు.