Thursday, May 8, 2025

ఉగ్రవాదుల మృతదేహాలకు పాక్ ఆర్మీ అంత్యక్రియలు: విక్రమ్ మిస్రీ

- Advertisement -
- Advertisement -

భారత్ అతిక్రమణలకు దిగిందంటూ పాకిస్తాన్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అన్నారు. పహల్గాం దాడితో పాక్ మొదటి తప్పు చేసిందని.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను ఐక్యరాజ సమితికి అందిస్తామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ప్రార్థనా మందిరాలను మేం టార్గెట్ చేయలేదన్నారు. భారత్ చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవని.. నియంత్రణ, ఖచ్చితత్వంతో ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశామని.. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదని చెప్పారు. కానీ, పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని.. దీంతో ముగ్గురు సిక్కు పౌరులు మృతి చెందారని తెలిపారు. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగానే ఉన్నామని.. ఎంత రెచ్చగొట్టినా సింధు జలాల ఒప్పందాన్ని మేం ఉల్లంఘించలేదన్నారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు పాకిస్తానే కారణమన్నారు. ఉగ్రవాదుల అంత్యక్రియలను పాక్ ఆర్మీ అధికారికంగా నిర్వహించిందని చెప్పారు. అంతర్జాతీయ సమాజానికి పాక్ తప్పుడు సమాచారం ఇస్తోంది.. తప్పుడు సమాచారంతో మతం రంగు పూయాలని చూస్తోందన్నారు. టీఆర్ఎఫ్ పేరును రిజల్యూషన్‌లో పెడితే దాన్ని తొలగించాలని పాక్ పట్టుబట్టిందని.. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని చెప్పారు. పహల్గాం దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ రెండుసార్లు ప్రకటించుకుందని. టీఆర్ఎఫ్‌ను ఐక్యరాజ సమితి నిషేధించాలని చూస్తే పాక్ అడ్డుకుందని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News