- Advertisement -
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజయౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. #SSMB29 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా అవి వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఓ స్టార్ హీరో అడగగా ఆయన రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. తమిళస్థార్ హీరో, చియాన్ విక్రమ్ (Vikram SSMB29). ఈ సినిమాలో ఓ పాత్ర చేయాలని విక్రమ్‌ను కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. అందుకు కారణం అది విలన్ పాత్ర కావడమే. విక్రమ్ విలన్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేశారట. ధీంతో ఈ పాత్రని పృథ్వీరాజ్ సుకుమారన్ చేయనున్నారు.
- Advertisement -