హైదరాబాద్: భాగ్యనగరంలో వినాయక మహా నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు నిమజ్జనాలకు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్, ఐడిఎల్, సఫిల్‌గూడ, ఉప్పల్, సున్నంచెరువుతో పాటు పలు ప్రాంతాలలో నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. 20 ప్రాంతాల్లో భారీవిగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లు ఉన్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు జరుగనున్నాయి. నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. అందుబాటులో 160 గణేశ్ యాక్షన్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 14,486 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు ఏర్పాటు చేశారు.
వినాయక మహా నిమజ్జనాలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -