- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినాయకుని శోభా యాత్రను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రులు పూజించిన గణపయ్యను గంగమ్మ వడికి చేర్చారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో చిన్నారి తను ఆదుకునే ఎలక్ట్రానిక్ జీపు బొమ్మలో గణపయ్య శోభా యాత్ర నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. గణపయ్య నిమజ్జనం సందర్భంగా మోత్కూరు చెరువు కట్టపై భక్తుల కోలహలం నెలకొంది. మోత్కూరు మండల కేంద్రంలోని చెరువులో గణపతులను నిమజ్జనం చేశారు.
- Advertisement -