తిరుమలలో మధురై చెందిన శివ అనే భక్తుడు పొరపాటున వదిలి వెళ్లిపోయిన విలువైన బంగారు ఆభరణాలను గెస్ట్ హౌస్ పారిశుద్ధ్య సిబ్బంది తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. భక్తులు పద్మావతి ఏరియాలోని వకుళమాత గెస్ట్ హౌస్ లో 5 నంబర్ గదిని అద్దెకు తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని వెళ్లిపోయారు. గదిని శుభ్రపరిచేందుకు వెళ్లిన పారిశుధ్య సిబ్బంది.. గదిలో బంగారు చైన్, కడియం, ఉంగరాలు ఇలా మొత్తం 128 గ్రాములు బంగారు ఆభరణాలు రూ.12 లక్షల విలువైనవిగా గుర్తించారు. పద్మావతి విచారణ కార్యాలయంలో పనిచేస్తున్న టీటీడీ సూపర్డెంట్లు దేవపత్ని భాస్కర్ నాయుడు, కుమారస్వామిల ద్వారా భక్తులకు ఫోన్ నెంబర్తో సమాచారం ఇచ్చారు. భక్తుల తగిన ఆధారాలతో తిరిగి తిరుమల పద్మావతి విచారణ కార్యాలయం చేరుకుని టీటీడీ సూపర్డెంట్ల సమక్షంలో ఆభరణాలను భక్తులకు అప్పగించారు. టీటీడీ సిబ్బంది నిజాయతీని కొనియాడిన భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు..
రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -