Wednesday, September 17, 2025

కెప్టెన్సీ వదిలేయడానికి కారణం అదే: విరాట్ కోహ్లీ

- Advertisement -
- Advertisement -

2021 ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టుతో ఓటమి తర్వాత అతను టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగాడు. అనంతరం జరిగిన ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ నుంచి కూడా అతను తప్పుకున్నాడు. అయితే విరాట్ ఇలా చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అసలు అతను ఎందుకు అలా చేశాడా? అని అంతా అనుకున్నారు.

తాజాగా విరాట్ కోహ్లీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఆర్సిబి బోల్డ్ డైరీస్’ పాడ్‌కాస్ట్‌లో అతను ఈ విషయం గురించి మాట్లాడాడు. తాను ఒక దశలో తీవ్ర ఒత్తిడి గురయ్యానని విరాట్ వెల్లడించాడు. భారత జట్టుకు 7-8 సంవత్సరాలు, ఆర్‌సిబికి 9 సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్న సమయంలో తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌పై అంచనాలు ఉండేవి అని పేర్కొన్నాడు. అదే తనలో ఒత్తిడి పెంచిందని తెలిపాడు. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటపడ్డానని.. ఇప్పుడు ప్రశాంతంగా పరుగులు చేస్తున్నానని అతను స్పష్టం చేశాడు. ఈ సీజన్‌లోనూ అతను చక్కగా పరుగులు చేయగలుగుతున్న అని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News