టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంగ్లాండ్ టూర్ కు ముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బాటలోనే కోహ్లీ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం కోహ్లీ.. టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నారు.
2011లో టెస్టులోకి అరంగ్రేటం చేసిన కోహ్లీ తన కెరీర్‌లో 123 టెస్టులు ఆడి మొత్తం 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇటీవల టెస్టు క్రికెట్ నుంచి రోహిత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ టి20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్లు ఒకేసారి రిటైర్ మెంట్ ప్రకటించడంతో వారి స్థానాల్లో ఆటగాళ్లను ఎంపిక చేయడం సెలెక్టర్లకు కఠిన పరీక్షే.