బెంగళూరు: విరాట్ కోహ్లి సుదీర్ఘ కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో పలు సీజన్లలో ఆర్సిబికి సార థ్యం వహించాడు. పలుసార్లు జట్టును ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. అయితే ఐపిఎల్ ట్రోఫీ ని మాత్రం సాధించలేక పోయాడు. ప్రతి సీజన్లో భారీ ఆశలతో బరిలోకి దిగడం ఖాళీ చేతులతో తిరిగి రావ డం బెంగళూరుకు అలవాటుగా మారిపోయింది. ఈసారి కూడా ఆర్సిబి ట్రోఫీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఐపిఎల్‌లో బెంగళూరుకే అంకితమైన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వేరే ఆలోచనతో ఉన్నాడు.
జట్టుకు ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించి పెట్టాలని భావించాడు. పేరుకు రజత్ పటిదార్ కెప్టెన్‌గా ఉన్నా కోహ్లినే అన్ని తానై జట్టును ముందుకు నడిపించాడు. పటిదార్ ఎప్పటికప్పుడూ సలహాలు, సూచనలు ఇస్తూ అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. తాను కూడా బ్యాట్‌తో జట్టుకు అండగా నిలిచాడు. జట్టులోని ప్రతి ఆటగాడిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగాడు. బ్యాట్‌తో రాణిస్తూనే ఫీల్డ్‌లో సహచరులను ఉత్సాహపరుస్తూ కోహ్లి జట్టు ట్రోఫీ సా ధించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక సుదీర్ఘ కాలంగా తనకు అందని ద్రాక్షగా ఉన్న ఐపిఎల్ ట్రోఫీ లోటును తీర్చుకున్నాడు.