- Advertisement -
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఓ వార్త పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగనున్నాడనే వార్త హల్ చేస్తోంది. సోషల్ మీడియా, జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు వెల్లువెత్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. మూడో టెస్టులో 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. ఇలాంటి స్థితిలో విరాట్ కోహ్లి మళ్లీ టెస్టు క్రికెట్‌లో ఆడాలని భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ సూచించాడు. ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. కోహ్లి కూడా టెస్టుల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడని, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాడనే వార్తలు గుప్పుమ్నాయి. కానీ ఇప్పటి వరకు బిసిసిఐ నుంచి కానీ కోహ్లి నుంచి కానీ దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.
- Advertisement -