Thursday, September 18, 2025

మేమిద్దరం ఒకేదానికి కట్టుబడి ఉంటాం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 2025లో భాగంగా సోమంవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ హైప్రొఫైల్ క్లాష్ కోసం క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో తనకు న్న అనుబంధం గురించి మాట్లాడాడు విరాట్ కోహ్లీ. గత 15 ఏళ్లుగా తమ మధ్య ఉన్న స్నేహబంధం, అనుభవాలు, పరస్పర గౌరవం గురిం చి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘ఎక్కువ కాలంగా ఒకరితో పాటు కలిసిఆడుతున్నప్పుడు, ఆటపైమనకున్న అవగాహనను ఒకరితో మరొకరు పంచుకుంటూ, నేర్చుకుంటూ ఉంటాం.

పైగా ఒకే సమయంలో కెరీర్‌లో ఎదుగుతున్నప్పుడు, ఇలాంటి అనుబంధం చాలా స హజంగా ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎన్నో సందేహాలు, ప్రశ్నలు మనం కలిసిచర్చించుకుంటాం. జట్టు నాయకత్వం వహించే విషయం లో మేము చాలా దగ్గరగా కలిసిపని చేశాం. ఎప్పుడూ ఆలోచనలు చ ర్చించేవాళ్లం. మేమిద్దరం ఎక్కువగా ఒకేదానికి కట్టుబడి ఉండేవాళ్లం. కలిసి ఉండేవాళ్లం. దాంతో ఇద్దరి మధ్య నమ్మకం ఏర్పడింది. అదే జట్టు కోసం మరింత పనిచేయాలనే స్ఫూర్తినిచ్చింది’ అని అన్నాడు విరాట్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News