టీం ఇండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్. టీం ఇండియా త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ అతిధ్య జట్టుతో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఇప్పటికే భారత జట్టుకు ఓ షాక్ తగిలింది. ఈ సిరీస్‌కి ముందే టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి రిటైర్ అవుతున్నట్లు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. తాజాగా కింగ్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్‌ల నుంచి రిటైర్ అవ్వాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అతను బిసిసిఐతో చెప్పినట్లు సమాచారం.
ఇంగ్లండ్ పర్యటన భారత జట్టుకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్ అవ్వడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్(Test Cricket) నుంచి రిటైర్ అయితే జట్టు మిడిలార్డర్ చాలా బలహీనం అవుతుంది. దీంతో విరాట్ రిటైర్‌మెంట్ నిర్ణయం గురించి పునరాలోచించుకోవాలని బిసిసిఐ అతన్ని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి కోహ్లీ(Virat Kohli) తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో.. లేదో వేచి చూడాల్సిందే.