Sunday, July 6, 2025

యూత్‌కు బయోపిక్ లాంటి సినిమా

- Advertisement -
- Advertisement -

రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్‌పై దయానంద్ గడ్డం రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్.( Virgin Boys) ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వర్జిన్ బాయ్స్ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందిని ఎంపిక చేసి ఐఫో న్లు గిఫ్ట్‌గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది.

ఈ సందర్భంగా నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ… “ఈ చిత్రానికి వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ ఖచ్చితంగా సరిపోతుంది. ఎన్నో సర్‌ప్రైజ్‌లతో (many surprises) ఈ సినిమాతో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము”అని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ మేము కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలను ఆ ధారంగా చేసుకుని ఈ సినిమా చేయడం జరిగిందని తెలిపారు. గీతానంద్ మాట్లాడుతూ ఈ సినిమా యూత్‌కు బయోపిక్ లాంటిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర శర్మ, రోనిత్, శ్రీహాన్ పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News