అమరావతి: విశాఖ పట్నంకు వచ్చిన ఎవరైనా ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ అందమైన నగరమని అందరికీ తెలుసు అని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..సుందరమైన విశాఖలో బీచ్ లు, పర్యాటక ఆతిత్యం మరచిపోలేనిదని, మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖ మారిపోయిందని తెలియజేశారు. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైందని, కొన్ని కేసులు జాప్యం కావచ్చుగానీ చాలా కేసులు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజలకు న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉందని, ఏదైనా సమస్యకు ఇరుపక్షాలు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవడానికి సహకరించాలని అన్నారు. మధ్యవర్తిత్వం నిర్వహించడానికి మధ్యవర్తికి మెలకువలు అవసరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరిస్తామని, మారుతున్న టెక్నాలజీ, మారుతున్న కాలంలో, కోర్టులకు వెళ్లేందుకు యాక్సెస్ పెరిగిందన్నారు. టాక్సేషన్, రిఫార్మ్స్ కారణంగా అభివృద్ధి పథంలోకి వెళ్తున్నామని, టెక్నాలజీ యుగంలో, ఆర్బిట్రేషన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై న్యాయమూర్తులు దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు.
Also Read : ఎరువు..దరువు