- Advertisement -
అమరావతి: మూగ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సీతమ్మధారలో మతిస్థిమితం లేని మూగ బాలిక(13)పై ఇద్దరు బాలుర్లు గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాలిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
- Advertisement -