Tuesday, May 20, 2025

విశాల్ బర్త్‌డే రోజున పెళ్లి

- Advertisement -
- Advertisement -

హీరో విశాల్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. హీరోయిన్ సాయి ధన్సికతో ఏడడుగులు వేయబోతున్నానని ప్రకటించారు. ఈ మేరకు చెన్నైలో జరిగిన ‘యొగిద’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్, సాయి ధన్సికలు తాము పెళ్లి చేసుకోబోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. ఇక విశాల్ బర్త్‌డే అయిన ఆగస్టు 29న పెళ్లి జరగనుంది. ఇక గతంలో విశాల్ వివాహంపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మీ, అభినయ వంటి హీరోయిన్స్ పేర్లు కూడా వినిపించాయి. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి రద్దయింది. ఇక ‘నడిగర్ సంఘం’ బిల్డింగ్ నిర్మాణం పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ ప్రకటించారు. ఈక్రమంలోనే ఇటీవల బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News