Friday, August 15, 2025

‘కన్నప్ప’ విషయంలో అది దొంగతనంతో సమానం: విష్ణు

- Advertisement -
- Advertisement -

మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ చిత్రం మంచి విజయం సాధించింది. మంచు విష్ణు కెరీర్‌లోనే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా గురించి ఓ విషయంలో మంచు విష్ణు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అది ఈ సినిమా పైరసీ (Kannappa Piracy) గురించి. ఎంతో కష్టపడి తీసిన సినిమా ఇలా పైరసీ‌కి గురికావడం చాలా బాధకరమని విష్ణు ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

‘’కన్నప్ప‌పై పైరసీ దాడి జరుగుతోంది. ఇప్పటికే 30 వేలకు పైగా అక్రమ లింక్‌లను తొలగించాం. ఇలా జరగడం చాలా బాధకరం. పైరసీ అనేది దొంగతనంతో సమానం. మన పిల్లలకు దొంగతం చేయడం నేర్పించము.. అలాగే పైరసీ (Kannappa Piracy) చూడటం కూడా దొంగతనమే. ఆ రెండిటికి తేడా లేదు. దయచేసి ఎంకరేజ్ చేయకండి. సినిమాను సరైన విధానంలో చూడండి’’ అంటూ ఎక్స్‌లో విష్ణు పోస్ట్ చేశారు.

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్పలో ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ప్రభాస్ కారణంగానే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని విష్ణు కూడా అంగీకరించారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News