మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్‌డే కానుక కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఓ ముఖ్యమై న అప్డేట్ వస్తుందని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంగా ‘విశ్వంభర’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘విశ్వంభర’ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారో చూడాలి. ఇక చిరంజీవి… దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండబోతుందటా. అలాగే తనకు బ్లాక్‌బస్టర్ వాల్తేరు వీరయ్య ఇచ్చిన దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈసారి చిరు కోసం బాబీ ఓ కొత్తకథను సిద్ధం చేశాడట. మెగాస్టార్ వయస్సుకు తగ్గట్టుగా యాక్షన్ అండ్ ఎలివేషన్స్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ చిత్రంగా ఇది ఉంటుందని తెలిసింది. ఈ సినిమాలో అభిమానులు,ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఆశించే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిసింది.