మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సోషియో ఫాంటసీ చిత్రంగా రానున్న ‘విశ్వంభర’ (Vishvambhara) షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. చిరంజీవి ఈ విజువల్ వండర్‌తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక మరో డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెగా 157 సినిమాలో చిరు బిజీగా ఉన్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుశ్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు.
చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తోంది. అయితే ఈ సినిమాల తర్వాత కూడా చిరు మరో సినిమా చేయబోతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ (blockbuster Walther Veeraiya) హిట్ అందించిన దర్శకుడు బాబీతో చిరు తన నెక్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు బాబీ సిద్ధమవుతున్నాడని తెలిసింది. ఈ సినిమా కోసం కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నాడట. ఇక ఈసారి చిరు కోసం బాబీ ఎలాంటి కథను పట్టుకొస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.