- Advertisement -
అమరావతి: ఓ మహిళ స్నానం చేస్తుండగా పక్కింటి వ్యక్తి వీడియో తీయడంతో అతడిని ఆమె భర్త ప్రశ్నించాడు. భర్తపై పక్కింటి వ్యక్తి దాడి చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పక్కింటి వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. వివాహిత స్నానం చేస్తుండగా పక్కింట్లో ఉండే పి శంకర్ అనే వ్యక్తి వీడియో తీశాడు. బాధితురాలు గమనించి కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. భర్త ఇంటికి రాగానే జరిగిన విషయం భర్త చెప్పడంతో శంకర్‌ను నిలదీశాడు. ఫోన్‌ను లాక్కోవడంతో అతడిపై శంకర్ దాడి చేసి ఫోన్‌తో పారిపోయాడు. స్థానిక దంపతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి శంకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -