- Advertisement -
అమరావతి: నవదంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిరంజీవి(30) అనే వ్యక్తి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.. గీతల వెంకట లక్ష్మీ(28) అనే యువతిని ఎనిమిది నెలల క్రితం చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. కొత్తవలస మండలం తమ్మన్నమెరకలో దంపతులు నివసిస్తున్నారు. వెంకట లక్ష్మి ఓ ప్రైవేటు స్టోర్‌లో పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి భర్త ఫ్యానుకు వేలడుతుండగా, భార్య విగతజీవిగా నేలపై పడి ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ఆ వార్తల్లో నిజం లేదు..
- Advertisement -